Header Banner

చైనాకు భారీ షాక్! ట్రంప్ నిర్ణయంతో మార్కెట్లలో భయాందోళన..!

  Wed Apr 09, 2025 09:20        Others

ప్రతీకార సుంకాలు విధిస్తూ ప్రపంచ దేశాలను వణికిస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనాకు గట్టి షాకిచ్చారు. ఆ దేశం నుంచి దిగుమతయ్యే వస్తువులపై ఏకంగా 104 శాతం సుంకాలు విధిస్తున్నట్టు ప్రకటించారు. ఈ దెబ్బతో ప్రపంచ మార్కెట్లు మరోమారు కుదేలయ్యాయి. అమెరికా మార్కెట్లు ఇప్పటికే నష్టాలను చవిచూశాయి. నిన్న ఆసియా మార్కెట్లు కూడా నష్టాల్లోకి జారుకున్నాయి. అమెరికా మార్కెట్లు తొలుత లాభాలతోనే ప్రారంభమయ్యాయి. అయితే, ట్రంప్ ప్రకటన తర్వాత ఒక్కసారిగా కుదేలయ్యాయి. ఎస్‌అండ్‌పీ 500 సూచీ ప్రారంభంలో 4.1 శాతానికిపైగా లాభంతో ట్రేడ్ అయింది. చివరికి 1.6 శాతం పతనమైంది.
ఫిబ్రవరిలో నమోదైన రికార్డు నుంచి ఈ సూచీ ఇప్పటి వరకు 19 శాతం దిగజారింది. మరోవైపు, డౌజోన్స్ కూడా నిన్న 0.8 శాతం, నాస్‌డాక్ 2.1 శాతం మేర కుంగిపోయాయి. ఇక, ఈ ఉదయం జపాన్ నిక్కీ 4 శాతానికి పైగా నష్టాలు చవిచూసింది. దక్షిణ కొరియా కోస్పి ఒక శాతం, ఆస్ట్రేలియా ఏఎస్ఎక్స్ 2 శాతం మేర దిగజారాయి. అలాగే, న్యూజిలాండ్, హాంకాంగ్, చైనా సూచీలు కూడా నష్టాల్లోనే ట్రేడ్ అవుతున్నాయి. నేడు భారత మార్కెట్లపైనా ప్రభావం పడే అవకాశం ఉంది. చైనాపై అమెరికా విధించిన 104 శాతం టారిఫ్ నేటి నుంచి అమల్లోకి రానుంది. మిగతా దేశాలపై విధించిన అధిక టారిఫ్‌లు కూడా నేటి నుంచి పూర్తిగా అమల్లోకి రానున్నాయి.

ఇది కూడా చదవండి: NRI లకు శుభవార్త తెలిపిన సీఎం చంద్రబాబు! పూర్తి వివరాలు అందరూ తప్పక తెలుసుకోవాల్సిందే! GO కూడా విడుదల!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఎయిర్‌పోర్ట్ పనులపై రామ్మోహన్ ఆగ్రహం.. కీలక ఆదేశాలు జారీ! ఎయిర్‌పోర్ట్ పూర్తికి డెడ్లైన్ ఫిక్స్!

 

ఏపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ చైర్మన్‌గా బొబ్బిలి ఎమ్మెల్యే, మాజీ మంత్రి! సభ్యులకు ఆయన కృతజ్ఞతలు..

 

ఆ విషయంలో ఏపీ సర్కార్ మరో కీలక నిర్ణయం.. వివిధ రంగాల నుంచి పది మంది నిపుణులు!

 

పోసానికి మరో బిగ్ షాక్ ఇచ్చిన ఏపీ పోలీసులు.. మళ్లీ అరెస్ట్..?

 

ఆ జిల్లాలో ఉద్రిక్తత వాతావరణం.. వైసీపీటీడీపీ నేతల మధ్య ఘర్షణ.. కార్ల ధ్వంసం.!

 

వాహనదారులకు కేంద్ర బిగ్ షాక్.. ఓరి దేవుడా.. దేశవ్యాప్తంగా పెరిగిన పెట్రోల్డీజిల్ ధరలు.!

 

ఏపీవాసులకు గుడ్ న్యూస్.. సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం.. ముఖ్యంగా ఈ మూడు - ప్రతీ నియోజకవర్గంలోనూ.!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #TrumpTariffs #ChinaShock #GlobalMarkets #TradeWar #MarketCrash